AP CM Chandra Babu |ధాన్యం సేకరణలో తప్పు జరుగొద్దు
AP CM Chandra Babu |ధాన్యం సేకరణలో తప్పు జరుగొద్దు
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు
Hyderabad : రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కృష్ణా జిల్లా గంగూరులోని రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు, ధాన్యం సేకరణను సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సేవా కేంద్రాల్లో ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు.
అన్నదాతలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు ఏం చేయాలనే అంశంపై సీఎం రైతులతో మాట్లాడారు. ఈ మేరకు రైతుల నుంచి సలహాలు, సూచనలు పొందారు. ఇక గతేడాది కంటే ఈ ఏడాది పంటలు అధికంగా పండాయని, మిషన్ హార్వెస్టింగ్‌తో ఎకరాకు ఐదు నుంచి ఆరు వేలు కలిసి వచ్చాయని రైతులు చెప్పారు.
ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘‘అన్నదాతకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. సాంకేతికతను చేరువ చేసి రైతులకు సాగు ఖర్చులు తగ్గిస్తాం. ఆధునిక వ్యవసాయంతో Andhra Pradesh రాష్ట్ర అన్నదాతను అగ్రస్థానంలో నిలుపుతాం. ఈ సీజన్ లో ధాన్యం సేకరణ విధానాలు మార్చి, నిబంధనలు సరళతరం చేసి ఖరీఫ్ లో ఇప్పటివరకు 19 లక్షల 90 వేల 945 మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ జరిపాం. 3 లక్షల మంది రైతుల నుంచి రూ. 4,584 కోట్ల ధాన్యం కొనుగోలు చేశా`` సీఎం పేర్కొన్నారు.
* * *
Leave A Comment